దమ్ముంటే 'కన్నప్ప' రికార్డులను బద్దలు కొట్టండి చూద్దాం ..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఫీవర్‌తో ఊగిపోతుంది. అనేక వాయిదాల తర్వాత ఈ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించాడానికి సిద్ధమవుతున్నారు.
ఔరంగజేబు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తూనే అర్థం అవుతోంది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ రికార్డుల వేటను మొదలుపెడతాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే అదే స్థాయిలో ఈ సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరుగుతోంది. #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానుల్లో కొందరు పవన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.గతంలో తమ అభిమాన హీరోల సినిమాలు విడుదల సమయాల్లో మెగా అభిమానులు చేసిన నెగిటివ్ పబ్లిసిటీకి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందే ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' విడుదల సమయంలో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాను గట్టిగానే టార్గెట్ చేశారు. ఆ సినిమాకు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టారు.
జనసేన ఎమ్మెల్యేలు ఓ అడుగు ముందుకేసి 'పుష్ప-2' సినిమాను ఏపీలో విడుదల కానివ్వం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మెగా అభిమానులు ఎంత నెగిటివ్‌గా పోస్టులు పెట్టినప్పటికీ, 'పుష్ప-2' ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా 'పుష్ప-2' నిలిచింది. 'హరిహర వీరమల్లు' విడుదల కానుండటంతో ఇప్పుడు అల్లు అభిమానుల వంతు వచ్చింది. 'హరిహర వీరమల్లు'కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్.

'పుష్ప-2' రికార్డులను కొట్టడం కాదు.. దమ్ముంటే కన్నప్ప రికార్డులను కొట్టాలని పవన్ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ అభిమానులు సవాల్ విసురుతున్నారు.'పుష్ప-2' పార్కింగ్ కలెక్షన్లు కూడా రావంటూ మరో అభిమాని స్పందించారు. 'పుష్ప-2' రికార్డులను కొట్టాలంటే మళ్లీ పుష్పనే రావాలంటూ ఓ అభిమాని స్పందించారు. ఇలా హరిహర వీరమల్లు సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
ఇక 'హరిహర వీరమల్లు' సినిమాకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు తమ పనిని ఎప్పుడో మొదలుపెట్టారు. సాధారణంగానే పవన్ కల్యాణ్ అంటే నచ్చని వైసీపీ అభిమానులు, 'హరిహర వీరమల్లు'కు నెగిటివ్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. #BoycottHHVM అనే హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ లేవల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇది కేవలం సినీ అభిమానుల మధ్య గొడవే కాకుండా రాజకీయంగా కూడా టర్న్ తీసుకుంది. ఇంత నెగిటివిటీ మధ్య 'హరిహర వీరమల్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications