నువ్వు చేసే పనులు అడల్ట్..యాంకర్ రష్మీని అంత మాట అన్నాడేంటి.?
యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీ జాతకమే మారిపోయింది.
జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేటు క్రేజ్‌ను యాంకర్ రష్మీ క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే రష్మీకి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. దీనిపై ఆమె పెద్ద యుద్దమే చేసింది. తాజాగా ఓ నెటిజన్ రష్మీని దారుణంగా విమర్శించాడు. తాజాగా రష్మీకి, నెటిజన్లకు మధ్య సినిమా, బుల్లితెరపై ప్రదర్శించే కంటెంట్ విషయంలో రష్మీతో ఓ నెటిజన్ వాగ్వాదానికి దిగాడు.
ట్రైన్ గుద్దుకోవడం వాళ్ళ ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ దృశ్యాలని రష్మీకి చూపిస్తూ.. నీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించు అన్నారు.
అన్నారు. దీనిపై నేను ఆల్రెడీ స్పందించానని ఆ నెటిజన్‌కు రష్మీ రిప్లై ఇచ్చింది. మీకు దమ్ముంటే మాంసం మానేయండంటూ ఆ నెటిజన్‌ను కోరింది. దీంతో ఈ వివాదం మరోవైపు టర్న్ తీసుకుంది. సినిమాల్లో చూపించే అడల్ట్ కంటే, టివి షోలలో చూపించే అడల్ట్ డైలాగ్స్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది.
బుల్లితెర మాత్రమే కాదు ప్రతి కంటెంట్ ప్రభావం చూపుతోంది. ఓటిటి, సినిమా ప్రభావం కూడా ఉంది అని రష్మీ పేర్కొంది. దీనిపై ఆ నెటిజన్ మరింత ఘాటుగా ప్రశ్నించాడు. సినిమాల్లో చూపిస్తున్నారు నిజమే.. దానికి వ్యతిరేకం. మీరు కూడా అలాంటి చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ షోలు అని చెప్పి అడల్ట్ కంటెంట్‌తో చేస్తున్నారు. అలాంటివి మీరు మానేయొచ్చుకదా అని రష్మీని ప్రశ్నించారు.
ఫ్యామిలీ షో అని చెబితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తారు కదా అంటూ రష్మీని ఇరకాటంలో నెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియని రష్మీ ..పబ్లిక్ ఫండింగ్ మొదలు పెట్టండి. అప్పుడు ఇలాంటి షోలు మానేసి.. మంచి షోలు మాత్రమే చేస్తాం అంటూ రష్మీ బదులిచ్చింది. ప్రస్తుతం రష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications