ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. కారణం ఎవరో చెప్పిన స్టార్ హీరోయిన్ !

ప్రముఖ నటుడు శత్రుజ్ఞ సిన్హా కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " సోనాక్షి సిన్హా ". 2010లో సల్మాన్ ఖాన్ సరసన 'దబంగ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. తొలి చిత్రంతోనే భారీ హిట్ అందుకొని స్టార్‌డమ్ సాధించింది. ఆ తరువాత 'రోడీ రాథోడ్', 'సన్ ఆఫ్ సర్దార్', 'హాలీడే', 'అక్బర్ 2', 'ఖండానీ షఫాఖానా', 'కలంక్' వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చివరగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన 'హీరా మందీ' వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

కాగా సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్‌తో 2024 జూన్ 23న వివాహబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వీరి వివాహం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. దాదాపు నాలుగేళ్లు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ మ్యారిడ్ లైఫ్‌ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తరచూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు.

sonakshi-sinha-shocking-comments-about-her-pregnancy

అయితే రీసెంట్ గా ఆమె చేసిన పోస్టు కారణంగా సోనాక్షి సిన్హా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె ఫోటోలను చూసిన వారంతా గర్భవతి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ రూమర్ల వ్యవహారం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారడంతో సోనాక్షి రెస్పాండ్ అవ్వక తప్పలేదు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ మరింత చర్చకు తెరలేపాయి. తన ప్రెగ్నెన్సీపై వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ.. తనపై ట్రోల్స్ కి కారణం తనే అంటూ షాక్ ఇచ్చింది.

ఎవరంటే..?

తాను ప్రెగ్నెంట్ ని కాదని.. బరువు పెరగడానికి కారణం తన భర్తే అంటూ స్పష్టం చేసింది. తాను అతిగా తింటూ బరువు పెరగడం వల్లే ఈ రూమర్స్ వచ్చాయని తెలిపింది. అంతే కాకుండా తన భర్తతో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా షేర్ చేసింది. అందులో "ఏమైనా తింటావా" అని ఇక్బాల్ ప్రశ్నించగా.. సోనాక్షి "ఇందాకే నీ ముందే డిన్నర్ చేశాను కదా!" అంటూ రిప్లై ఇచ్చింది. మరోవైపు బరువు పెరగడమంటే తప్పేనా? అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+