హీరోలకు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు
సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం హీరోల పక్కన నృత్యాలు చేయడానికి, సీరియస్ సన్నివేశాల్లో వారిపక్కన నిలబడడానికి మాత్రమే అన్నట్లుగా ఉండేది. కాలం మారుతున్నకొద్దీ హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే వారి రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. హీరో పక్కన నృత్యం చేయడానికి మాత్రమే హీరోయిన్ అనే పద్ధతికి ప్రస్తుత హీరోయిన్లు గండి కొట్టారు. కథలో తమకు కూడా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. లేదంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు.
నయనతార, త్రిష, సమంత, సోనాక్షిసిన్హా, దీపికా పడుకొనే, కైరా అద్వానీ.. తదితరులంతా ఎంతో డిమాండ్ ఉన్న హీరోయిన్లు. ప్రస్తుతం వీరు పెరుడుతున్న షరతులు నిర్మాత, దర్శకులకే కాకుండా హీరోలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఎంత పారితోషికం తీసుకున్నా సినిమా ప్రచారానికి మాత్రం నయనతార రాదు. రావాలంటే ప్రత్యేక పారితోషికం ఇస్తామని నిర్మాత బతిమలాడుకోవాలి. కోట్లరూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీసే నిర్మాత ఒక హీరోయిన్ ను బతిమలాడుకోవాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సాయంత్రం ఆరుగంటల తర్వాత త్రిష మేకప్ వేసుకోవడానికి అసలు ఇష్టపడదు. అలాగే సోనాక్షి సిన్హా సైతం ఇలాంటి నిబంధనలనే పాటిస్తున్నారు. తాను అసలు బోల్డ్ రోల్స్ చేయనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. నటిగా ఆమెకు 35 సినిమాల అనుభవం ఉంది. లిప్ కిస్, శృంగార సన్నివేశాల్లో నటించలేదనే బాధ తనకు ఉండదన్నారు. బోల్డ్ సన్నివేశాలు చేయను అని తాను ముదుగానే చెబుతానన్నారు. దబాంగ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సోనాక్షి ఇంతవరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రెమ్యునరేషన్ కూడా భారీస్థాయిలో ఉంటుంది.












Click it and Unblock the Notifications