ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన తెలుగు హీరోయిన్
సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు.
అయితే గతంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచారంలోకి అడుగుపెట్టి కెరీర్‌ను తన చేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారిలో గ్లామర్ డాల్ నిషా నూర్ ఒకరు. తమిళనాడులోని నాగపట్నంకు చెందిన నిషా నూర్.. 80ల్లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పట్లో నిషా నూర్ తమిళంలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1990ల్లోనే నిషా నూర్ బికినీ వేసి సంచలనం సృష్టించింది. నిషా నూర్ తన గ్లామర్, బోల్డ్ పాత్రలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది.

కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలతో నటించిన నిషా నూర్ .. కె.బాలచందర్, భారతీరాజా లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేశారు.తెలుగులో రాజేంద్ర ప్రసాద్, భాను చందర్ నటించిన సినిమాల్లో నిషా నూర్ నటించింది. కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగిన నిషా నూర్ తర్వాత కనుమరుగైంది. సినిమాలు తగ్గుతున్న సమయంలో ఓ నిర్మాతను నమ్మి మోసపోయింది. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నిషా నూర్‌ను నమ్మించిన నిర్మాత ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవడంతో నిషా ఇలా వ్యభిచారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అటు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిషా నూర్ వ్యభిచార వృత్తిని కొనసాగించింది.

కష్ట కాలంలో ఆమెకు తన కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. నిషా నూర్ ఓ దర్గా బయట వీధిలో నిద్రపోయే పరిస్థితి వచ్చిందంటే.. ఆమె జీవితం ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ ఎన్జీఓ సంస్థ నిషా నూర్‌ను గుర్తించింది. బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. హాస్పిటల్‌లో టెస్టులు చేయించగా నిషా నూర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. నిషా నూర్.. 2007లో 44 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్‌తో పోరాడుతూ మరణించింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications