ప్రభాస్ 'స్పిరిట్' సినిమాపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు.. వారికి సవాల్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై- ఓల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చేయని శక్తివంతమైన పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా స్పిరిట్ మూవీపై నిర్మాత ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ప్రణయ్ రెడ్డి నిర్మించిన రోమాంచకం మూవీకి మిక్స్ డ్ రివ్యూస్ రావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శకులపై ఫైర్ అయ్యారు.
ఒక సినిమా తయారీ వెనుక ఎంత కష్టం, తపన ఉంటుందో అర్థం చేసుకోకుండా రివ్యూలు ఇస్తున్నారని.. 'రోమాంచకం' సినిమా విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రచయిత రాసిన కథను తెరపైకి తీసుకొచ్చేందుకు డైరెక్టర్ ఎంతో కష్టపడతాడు.. షూటింగ్ టైమ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అందరికీ అర్ధం కావని తెలిపారు. అలాంటి వారికి నిజంగా సత్తా ఉంటే తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ ను ఆపే దమ్ముందా..? ఆ సినిమా స్థాయిని తగ్గించగలరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దమ్ముంటే.. స్పిరిట్ మూవీని తమ నెగటివ్ రివ్యూలతో చంపి చూడాలని సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
రోమాంచకం మూవీ హిట్ కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను పెట్టింది. అయితే ఈ వేడుకకు హాజరైన నిర్మాత ప్రణయ్ రెడ్డి.. రోమాంచకం మూవీలోని కామెడీని యూత్ బాగా ఎంజాయ్ చేస్తోందని అన్నారు. ఇందులో సుమంత్ ప్రభాస్, అనంతిక బాగా నటించారని అభినందించారు. తమ బ్యానర్ లో వచ్చిన సినిమాలతో హీరోలకు ప్లస్ అవ్వడమే తప్పితే నెగటివ్ కాలేదని పేర్కొన్నారు. వేణుగోపాల్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రోమాంచకం మూవీ సెప్టెంబర్ 3న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఇక భద్రకాళి బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఫస్ట్ సినిమా విజయ్ దేవరకొండతో చేసిన అర్జున్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అనే పేరుతో తీశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో యానిమల్ చిత్రం చేశారు. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ రాబోతుంది.












Click it and Unblock the Notifications
