నా భార్య మాట వినదు..యాంకర్ స్రవంతి చొక్కారపు భర్త షాకింగ్ కామెంట్స్
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు మార్మోగిపోతోంది. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు. తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూలో స్రవంతి లైఫ్ లైన్లోకి వచ్చింది.
ఆ తరువాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంతంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయింది పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ.

భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
స్రవంతి చొక్కారపు డ్రెస్సింగ్ స్టైల్ గురించి గతంలో ఆమె భర్త చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ పాల్గొన్నారు స్రవంతి భర్త ప్రశాంత్. ఈ సందర్బంగా యాంకర్ స్రవంతి డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆమె భర్తను ప్రశ్నించడం జరిగింది. స్రవంతి డ్రెస్సింగ్ విషయంలో మీరు ఏమైన సలహాలు , సూచనలు ఇస్తుంటారా అని భర్త ప్రశాంత్‌ను సదరు యాంకర్ ప్రశ్నించింది.
దీనిపై స్రవంతి భర్త మాట్లాడుతూ...నేనం ఆమె విషయంలో కలుగజేసుకోనని..నేను చెప్పిన ఆమెకు పెద్దగా నచ్చదని చెప్పుకొచ్చారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నాకు పెద్దగా ఐడియా లేదని, ఆ నిర్ణయం తనకే వదిలేశానని స్రవంతి భర్త ప్రశాంత్ తెలిపారు. కొన్నిసార్లు చెప్పడం జరిగిందని..నా సూచనలు నచ్చలేదని..గతంలో అనుభవం ఎదురైందని అప్పటి నుంచి ఆమెకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదని స్రవంతి భర్త తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications