తన డ్యాన్స్‌తో స్టార్ హీరోను దారుణంగా అవమానించిన శ్రీలీల

తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కున శ్రీలీల పేరునే చెబుతారు. గత సంవత్సర కాలంలో ఆమె నటించిన సినిమాలే దీనికి కారణం. గతేడాది ఆమె నటించిన సినిమాలు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్‌పై దాడి చేశాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు.

పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు.

Sreeleela dance video goes viral

అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో తెలుగులో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా 'రాబిన్ హుడ్' అనే సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. తొలుత ఈ సినిమాలో రష్మికను ఎంపిక చేశాడు దర్శకుడు. దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రష్మిక స్థానంలో శ్రీలీల చేరింది. తాజాగా ఈ సినిమాలో ఓ పాట కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లింది. అయితే షూటింగ్ సమయంలో శ్రీలీల సరదాగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సీనియర్ ఎన్టీఆర్ హిట్ సాంగ్ అయిన ''లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం'' అనే సాంగ్‌కు తనదైన స్టైల్లో స్టెప్పులు వేసింది. ఆ వీడియోలో నితిన్ కూడా ఉన్నాడు. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అయితే శ్రీలీల తన డ్యాన్స్‌తో లెజెండరీ నటుడిని అవమానపరించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పెద్దాయనను ఎక్కిరించేలా డ్యాన్స్ చేయడం ఏంటని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+