శ్రీలీలను సినిమా మధ్యలో నుంచి తేసేసిన స్టార్ హీరో..?
హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి.
#Sreeleela out from #Lenin due to dates issue
— CHITRAMBHALARE (@chitrambhalareI) June 25, 2025
Guess new heroine for #AkhilAkkineni project ?? pic.twitter.com/dHZV1WUWmT
ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే రవితేజతో 'మాస్ జాతర' అక్కినేని అఖిల్ నటిస్తూన్న 'లెనిన్' సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..'లెనిన్' సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఆ సినిమా నుంచి శ్రీలీల వైదొలిగిందని తెలుస్తోంది. శ్రీలీల స్థానంలో మమిత బైజు, పూజా హెగ్డే, అనుపమ, భాగ్య శ్రీ బోర్సే పేర్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications