శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ ..?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్‌లో శ్రీలీల టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. శ్రీలీల చేతిలో ఉన్ననన్ని సినిమాలు మరే హీరోయిన్ చేతిలో లేవంటే..ఈ అమ్మడు హవా తెలుగు ఇండస్ట్రీలో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు సినిమాలు మొత్తం శ్రీలీల చేతిలోనే ఉన్నాయి. ఇప్పటికే స్కంద సినిమా విడుదల కాగా, ఆది కేశవ, గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ విడుదల కావాల్సి ఉన్నాయి.

sreeleela rejected allu arjun movie

మహేష్ బాబుతో నటిస్తున్న గుంటూరు కారం హిట్ అయితే .. మరి కొందరు సీనియర్ హీరోల సరసన శ్రీలీల నటించే అవకాశం దక్కుతుంది. ఇదిలా ఉంటే శ్రీలీల.. హీరో అల్లు అర్జున్‌తో నటించిన అవకాశం వచ్చినప్పటికీ ..దానిని రిజెక్ట్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు.

sreeleela rejected allu arjun movie

ఈ పుష్ప-2 పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో కూడా శ్రీలీలనే మొదట హీరోయిన్‌గా అనుకున్నారంట. అయితే శ్రీలీల, అల్లు అర్జున్ సినిమాను రిజెక్ట్ చేసిందట. డేట్స్ ఖాళీ లేకనే అల్లు అర్జున్‌తో సినిమాను శ్రీలీల వదులుకుందట.తనకు ఏమాత్రం కాల్ షీట్స్ లేకపోవడంతోనే ఈ సినిమా కథ నచ్చినప్పటికీ వదులుకోవాల్సి వస్తుందని చెబుతూ ...శ్రీలీల ఈ సినిమా అవకాశాన్ని వదులుకుందట.

sreeleela rejected allu arjun movie

అయితే ఈ విషయంపై శ్రీలీలకు అల్లు అర్జున్ కాల్ చేసి మాట్లాడారని తెలుస్తుంది. నా సినిమానే రిజెక్ట్ చేస్తావా అంటూ బన్ని తనదైనశైలిలో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అల్లు అర్జునే స్వయంగా ఫోన్ చేయడంతో..ఆయనతో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఎలాగైతే శ్రీలీల- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+