ఆ హీరోతో నటించను..తేల్చేసిన శ్రీలీల..?
తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోతోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు.
శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు 'గుంటూరు కారం, నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు.

అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల ఓ స్టారో హీరో సినిమాను రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.తమిళ హీరో కార్తీకు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంటాయి.
కార్తీ నటించిన సర్దార్ తెలుగులో కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా రాశి ఖన్నా నటించగా, సెకండ్ పార్ట్‌లో శ్రీలీలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సినిమాలో తన పాత్ర తక్కువగా ఉండటంతోనే సర్దార్ 2ను నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. సూపర్ హిట్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాను రిజెక్ట్ చేయడం ఏంటని అభిమానులు ఆమెపై గుర్రుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications