ఆ ఇంటి కోడలుగా శ్రీలీల..అతనితో పెళ్లి ఫిక్స్..?
హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.ఇక అప్పటి నుంచి , ఇప్పటి వరకు ఈ భామ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి.
ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు. ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.ఇదే సమయంలో శ్రీలీల వ్యక్తిగత వ్యవహారంతో కూడా వార్తల్తో నిలుస్తోంది. శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
శ్రీలీల,కార్తీక్ ఆర్యన్ ఇద్దరు ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో కూడా శ్రీలీల తళుక్కున మెరిసింది. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఒక మంచి డాక్టర్ అయితే మా అబ్బాయికి జోడిగా ఉంటుంది ..అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు. శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ చదువుతోంది. ఈ విషయం అందరికి తెలిసిందే.కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్‌తో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు.ఇక తాజాగా వీరిద్దరూ మిర్రర్ సెల్ఫీ మరోసారి కలిసి దర్శనం ఇచ్చారు.దీంతో అతనితో శ్రీలీల లవ్‌లో ఉందంటూ బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications