ఫుల్‌గా తాగేశావా ఏంటీ పాప..?
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇందులో ఆమె మెరిసే బ్లౌస్ ధరించి కారులో ఎంతో హ్యాపీగా కనిపిస్తుంది . క్యూట్‌గా కనిపిస్తున్న శ్రీలీల వీడియో చూసి నెట్టింటా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ఈ వీడియోలో శ్రీలీల పార్టీ మూడ్‌లో హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. డాన్స్ చేస్తూ కారులో రకరకాల ఫొటో ఫోజులను ఇచ్చింది. ఫ్యాన్స్‌ని ఫిధా చేస్తోంది. ఇది చూసిన చాలా మంది శ్రీ లీల ఎంత క్యూట్‌గా ఉంది, నాటిగా ఉందని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఏంటి పాప పార్టీలో రచ్చరంబోలో చేసావా? ఫుల్‌గా తాగేసావా? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications