బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఫారెన్‌లో దర్శనం ఇచ్చిన శ్రీలీల..?
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. ఈ తరం హీరోయిన్లకు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను చూస్తే శ్రీలీల ఫారెన్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది. అయితే ఈ శ్రీలీల షేర్ చేసిన ఫొటోల్లో ఓ వ్యక్తి కూడా కనిపించాడు.
ఓ ఫొటోలో ఎవరో కుర్రాడితో శ్రీలీల మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఆ కుర్రాడి ఫేస్ బయటపడకుండా శ్రీలీల జాగ్రత్తపడింది. దీంతో అ అసలు ఆ కుర్రాడు ఎవరు? అతడితో ఏం మాట్లాడుతుంది? శ్రీలీల సడెన్‌గా పారిస్ వెళ్లడానికి కారణలేంటి, శ్రీలీల ప్రియుడుతో ఫారెన్ టూరుకు వెళ్లిందంటూ నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications