ఏంట్రా బాబు..సొంత పెళ్లాన్ని అడినట్టు అడిగావ్
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన ఎనర్జీతో ఎక్కడ ఉన్నా సందడి చేయగలదు. కేవలం వెండితెరపైనే కాదు, పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా తన చలాకీతనంతో అందరినీ ఫిదా చేయడం ఆమె స్టైల్. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన 'జూబిలేషన్ 2K26' ఫెస్ట్‌లో శ్రీలీల చేసిన హంగామా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
శ్రీలీల మాస్ రిప్లై
నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా జరిగిన జూబిలేషన్ వేడుకలకు శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె స్టేజ్‌పైకి అడుగుపెట్టడమే ఒక పవర్ ప్యాక్డ్ ఎంట్రీలా అనిపించింది. వేలాది మంది విద్యార్థుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.స్టూడెంట్స్‌తో సరదాగా ముచ్చటించిన శ్రీలీల, తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన అమ్మమ్మ, తాతయ్యల ఊరు ఒంగోలు అని చెప్పగానే విద్యార్థులు ఫుల్ జోష్‌లోకి వచ్చారు. చదువు మన జీవితానికి పునాది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడాలి అంటూ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇచ్చారు.

పంచ్ అదిరింది
చాలా సేపు మాట్లాడిన శ్రీలీల సరదాగా.. అరిచి అరిచి నా గొంతే పోయింది అని నవ్వుతూ అన్నారు. అయితే, అక్కడున్న కుర్రాళ్లు ఊరుకుంటారా? డ్యాన్స్.. డ్యాన్స్ చేయాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఇలాంటి సమయాల్లో కొంచెం ఇబ్బంది పడతారు. కానీ, మన 'ధమాకా' బ్యూటీ మాత్రం తనదైన శైలిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు.. సరే డ్యాన్స్ చేద్దాం రండి వారిలో జోష్ నింపింది.ఆమె నోటి నుంచి వచ్చిన ఈ మాస్ డైలాగ్‌కు స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆమె స్పాంటినిటీకి, ఆ చమత్కారానికి స్టూడెంట్స్ అంతా ఫిదా అయిపోయారు. చెప్పినట్టుగానే విద్యార్థులతో కలిసి శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు ఈ ఫెస్ట్‌కే హైలైట్‌గా నిలిచాయి.
ఒకవైపు ఇలాంటి ఈవెంట్లతో యూత్ క్రష్‌గా నిలుస్తూనే, మరోవైపు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్' లో నటిస్తున్న ఈ అమ్మడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 55వ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి తన జోరు చూపిస్తోంది.












Click it and Unblock the Notifications