శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్..!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్స్ ప్లాఫ్స్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓం భీమ్ భుష్, స్వాగ్, సింగిల్, విష్ణు విన్యాసం, మృత్యంజయ్ లాంటి సినిమాలతో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ అంటూ మరోసారి క్రేజీ స్టోరీతో వస్తున్నాడు. ఈమేరకు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. కామెడీ ఎంటర్ టైనర్ తో పాటు నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు స్పష్టం అవుతోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే టాలీవుడ్ సీనియర్ నటి రాధిక.. బాలయ్య సినిమా కోసం క్యూ లైన్ లో నిల్చుని టికెట్స్ తీసుకోవడం.. సినిమా సూపర్ హిట్ అనడం.. యావరేజ్ అన్న మరో ఫ్యాన్ తల పగలగొట్టడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాధిక.. మూడు నెలల్లో బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం సినిమాలు వస్తాయని అవన్నీ నేను చూడలేను కదా సర్ అనే డైలాగ్స్ నవ్వించాయి.

ఆ తర్వాత హీరో శ్రీవిష్ణు- హీరోయిన్ మహిమా నంబియార్ మధ్య క్యూట్ లవ్ సీన్స్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. ప్రేమకు భాషతో పనిలేదు.. కంటి చూపుతో మాట్లాడేస్తా అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ ఓ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అని పోలీసులు చెప్పడంతో ట్రైలర్ గ్రిప్పింగ్ గా మారుతుంది. మొత్తానికి కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి జానకిరామ్ మర్ల దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. చూస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడినట్లేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
