శ్రీ విష్ణు కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. ఈ సారి కామెడీ కాదు అంతకు మించి..!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటారు. యూత్ ఫుల్ కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ లు తీస్తూ యువతకు దగ్గరైన హీరో శ్రీ విష్ణు. ఈ ఏడాది మృత్యుంజయ్, విష్ణు విన్యాసం సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు.. గతేడాది సింగిల్, 2024 లో స్వాగ్, ఓం భీమ్ భుష్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు శ్రీ విష్ణు. అయితే ప్రస్తుతం ఆయన కామ్రెడ్ కళ్యాణ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1992 లో ఆంధ్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో పీరియడ్‌ బ్యాక్‌ డ్రాప్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నాడు.

కామ్రెడ్ కల్యాణ్ చిత్రానికి వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ అక్టోబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇటీవల ప్రకటించారు. ఇక శ్రీ విష్ణు తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రో గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. ఎప్పుడూ కామెడీ, లవ్ ఎంటర్ టైన్ చిత్రాలతో అలరించే శ్రీ విష్ణు ఈసారి మాత్రం సరికొత్త ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై నాగవంశీ సమర్పణలో హారికా సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో నూతన దర్శకుడు సన్నీ సంజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

SreeVishnu new movie glimpse released The young Tollywood hero is coming with an emotional story

ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లోనే సినిమా స్టోరీపై దర్శకుడు ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలతో పెరిగిన ఓ సాధారణ మధ్య తరగతి యువకుడు.. తన ఇంట్లోని కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాధ్యతల కారణంగా సాధారణ జీవితాన్ని కొనసాగించే పరిస్థితిని ఇందులో చూపించినట్లు గ్లింప్స్ లో స్పష్టం అవుతోంది. నిత్యం చాలామంది మిడిల్ క్లాస్ యువకుల్లో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను ఈ మూవీలో దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+