బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితో పెళ్లిపై శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.

తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలపై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

sri reddy react on marriage with byreddy siddharth reddy

కొందరు నేతల వల్లే పార్టీ ఓడిపోయిందని కాస్తా ఘాటుగానే ఆమె రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టమని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని శ్రీరెడ్డి పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై శ్రీరెడ్డి స్పందించారు.

శ్రీరెడ్డి మాట్లాడుతూ..బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గురించి నా గురించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఆ అబ్బాయి నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాం అని. నేనేదో సరదాకి బైరెడ్డి బావుంటాడు అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని అన్నాను. కానీ నిజంగా నేనెప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ, అతడితో ఫోన్‌లో మాట్లాడటం వంటివి చేయలేదు. అసలు బైరెడ్డి ఎక్కడుంటాడో కూడా నాకు తెలియనే తెలియదు. నా గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన పర్లేదు. కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని నాశనం చేయకండి. అతను చిన్న పిల్లోడు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడని అతని రాజకీయ జీవితం నాశనం చేయవద్దని శ్రీరెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+