ఆ స్టార్ హీరో ఆరోగ్యం కోసం ఉపావాసాలు, పూజలు చేసిన శ్రీదేవీ.. ఆ హీరో ఎవరంటే..?
భారతీయ చిత్ర పరిశ్రమ ఆరాధించే నటి అలనాటి అందాల తార శ్రీదేవి. ఈమె తన సినీ జీవిత ప్రస్థానంలో ఎన్నో చిత్రాల్లో నటించి, మంచి విజయాలను అందుకున్నారు. ఎంతోమంది నటులతో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే, శ్రీదేవి ఓ స్టార్ హీరో కోసం ఏకంగా ఏడు రోజులు ఉపవాసం ఉండి, ప్రత్యేక పూజలు చేసిందంట..? ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా..?
ఆ నటుడు ఎవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన శ్రీదేవితో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పలు భాషల్లో 20కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. అయితే, ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాల మేరకు... రజనీకాంత్ ఆరోగ్యం కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం ఉన్నారట.. అంతేకాదు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రత్యేకంగా షిరిడి సాయిబాబాకు పూజలు చేశారట. ప్రముఖ నటుడు రజనీకాంత్ 2011లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న శ్రీదేవి, షిరిడీ సాయిబాబా పేరు మీద ఏడు రోజులు ఉపవాసం ఉన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని పూణే సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

పెళ్లిచేసుకోవాలనుకున్నారు..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం 2011లో చాలా క్షీణించింది. అప్పడు ఆయన రవికుమార్ దర్శకత్వంలో రానా సినిమా చేసేవారు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, అప్పుడు శ్రీదేవి చేసిన ఉపవాసం, పూజలు, అందరి అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ తిరిగి కోలుకున్నారట. శ్రీదేవి తన 15వ ఏట సూపర్‌స్టార్‌తో కలిసి పనిచేశారు. రజనీకాంత్, శ్రీదేవి కలిసి చాలా సినిమాలు చేశారు. వాటిలో చాలా బ్లాక్‌బస్టర్‌లు కూడా ఉన్నాయి. అయితే, ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ సమయంలోనే నిర్మాత బోనీ కపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. అయినా, వీరిద్దరి మధ్య స్నేహం ఎప్పటిలాగే ఉండేది. రజనీకాంత్, శ్రీదేవి కలిసి నటించిన చిత్రాల్లో మూండ్రు ముడిచు, నాన్ ఆడిమై ఇల్లై, పోకిరి రాజా, భగవాన్ దాదా, షల్బాస్ వంటివి మంచి విజయాన్ని అందుకున్నాయి.












Click it and Unblock the Notifications