అతనితో ప్రేమలో పడ్డ శ్రీలీల..పబ్లిక్‌గా ఆ పని చేయడంతో క్లారిటీ

హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపేసింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజ, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, నితిన్ వంటి హీరోల సినిమాల్లో నటించింది.

పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్‌ 'రిబిన్ హుడ్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంతో పాటు, బాలీవుడ్‌లో కూడా ఈ భామ సత్తా చాటడానికి రెడీ అవుతోంది. తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

Srileela said I love you to a fan on social media

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల , ఎప్పుటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. అందులో భాగంగా చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ఓ నెటిజన్ ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టారు. దానికి శ్రీ లీల 'ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యూ' (Muah Muah I LOVE YOU) అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+