SSMB 29: మాస్ మసాలా మీల్స్: సామి విశ్వరూప దర్శనం
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ జోరుగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకొంటోన్నారు. ఇదే రోజున అతడు కూడా రీ రిలీజ్ కావడం.. డబుల్ జోష్ ఇచ్చినట్టయింది ఫ్యాన్స్ కు. అతడు థియేటర్లల్లో పండగ చేసుకుంటోన్నారు. అక్కడే కేక్ కట్ చేసి మహేష్ కు విషెస్ చెబుతున్నారు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్ఝలు తెలియజేస్తోన్నారు. ఈ లిస్ట్ లో పొలిటికల్ లీడర్లు సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, గుంటూరు మాజీ ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్.. ఆయనకు గ్రీటింగ్స్ చెప్పారు.

మహేష్ బాబుతో కలిసి దిగిన ఫొటోను రఘురామ కృష్ణంరాజు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. నాన్ కాంట్రవర్సియల్ అయిన మహేష్ బాబును ఓన్ చేసుకుంది వైఎస్ఆర్సీపీ. అందుకే ఆ పార్టీ సోషల్ మీడియా మహేష్ పై శుభాకాంక్షల వర్షాన్ని కురిపిస్తోంది.
ఇదిలావుండగా- మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. SSMB 29. ఇది వర్కింగ్ టైటిల్. ఎస్ ఎస్ రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా ఇందులో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోన్నారు. మలయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తోన్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించాడు రాజమౌలి.
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన అప్ డేట్స్ అధికారికంగా వెలువడతాయని అభిమానులు ఆశించారు. అప్పుడు, ఇప్పుడూ అంటూ సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన కొంత సమాచారం చక్కర్లు కొట్టింది కూడా.
దీనికి తెర దించారు రాజమౌలి. ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్ డేట్స్ కూడా ఇప్పుడప్పుడే వెలువడబోవని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో అప్ డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అప్పటివరకు ఓపిక పట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులను కోరుతున్నట్లు చెప్పారు.
ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోన్నందుకు థ్యాంక్ప్ చెప్పారు. ఈ సినిమా కథ, పరిధి చాలా పెద్దదని, ఏవో కొన్ని ఫొటోలు లేదా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం సాధ్యం కాదని భావిస్తున్నాననని, అది అసంపూర్తిగా ఉంటుందని రాజమౌలి చెప్పారు.
ప్రస్తుతం ఓ స్పెషల్ వీడియోను సిద్ధం చేస్తున్నామని, ఇది- ఎస్ఎస్ఎంబీ 29 డెప్త్, ఎసెన్స్.. ఎంతో తెలియజేస్తుందని, ఆ మూవీ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు రాజమౌలి. ఈ స్పెషల్ అప్ డేట్‌ను నవంబర్ 2025లో విడుదల చేస్తామని, ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications