ట్రంప్ ఎఫెక్ట్.. SSMB29 షూటింగ్ కు బ్రేక్..!

ఎవరి మాటా వినడు సీతయ్య అయితే ప్రపంచ దేశాల మాట వినడు ట్రంపయ్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా పాలసీల వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లోని వివిధ రంగాలపై వీటి ప్రభావం పడుతోంది. వీటి ప్రభావం సినిమా రంగంపైనా తీవ్రంగా పడింది

రాజమౌళి సినిమా అంటేనే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అధికంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో కనిపించేదే VFX. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'SSMB29'. ఈ సినిమాలోనూ దాదాపు 80 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుందట. అది కూడా అమెరికాకు చెందిన ఓ భారీ కంపెనీతో చిత్రయూనిట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని సమాచారం.

SSMB29 Feels the Heat of Trump-Era Tariffs

ట్రంప్ తీసుకున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా టారిఫ్‌లు, వాణిజ్య నిబంధనలతో ఈ VFX ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరగనుంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి రాజమౌళి బృందం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అవసరమైతే కొద్ది రోజులు షూటింగ్ నిలిపివేయడానికి చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

ట్రంప్ ఎఫెక్ట్ కేవలం 'SSMB29'కు మాత్రమే పరిమితం కాదు. VFX ఎక్కువగా ఉపయోగించే ఇతర భారీ చిత్రాలు కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు పాన్-ఇండియా, గ్లోబల్ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా VFX కంపెనీలతో సహకారం సర్వసాధారణంగా మారింది. కానీ, ఖర్చుల పెరుగుదల వల్ల నిర్మాతలు బడ్జెట్‌ను సమతుల్యం చేయడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+