#SSMB29 మొత్తానికి రివీల్ అయిపోయిందోచ్.. జక్కన్న స్పెషల్ మెసేజ్ !
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లీకులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్‌లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఒరిస్సా షెడ్యూల్ ముగిసిన సందర్భంగా కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి. అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళి SSMB29 అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీంతో మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ SSMB29 ఫిక్స్ అయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు.
సినిమా అనౌన్స్ మెంట్ నుంచి ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ఈ మూవీ వస్తుండడంతో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ పెడతారా..? లేక రాజమౌళి, మహేష్ బాబు పేర్లు కలిపి SSRMB అనే ట్యాగ్ లైన్ తీసుకువస్తారా అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు జక్కన్న అఫిషియల్ గా SSMB29 అని లెటర్లో రాయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బాజ్ నడుస్తోంది.
From the sets of #SSMB29 🔥@urstrulyMahesh @ssrajamouli pic.twitter.com/OYIqOhuDH4
— TWTM™ (@TWTM__) March 18, 2025
ఇక ఒడిశాలోని కోరాపుట్ కొండలపై తీసిన ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా సహా పలువురిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిరీసెంట్ గా లీకైనా వీడియోలో సైతం మహేష్ బాబు ఫియార్సీ లుక్ లో అదరగొట్టారు. అయితే రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఘాట్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
#SSMB29 🦁 pic.twitter.com/if6s5uuIW8
— Amalapuram Mahesh FC (@AmalapuramMBFC) March 18, 2025












Click it and Unblock the Notifications