ఇదేందయ్యా ఇది.. కుక్క కోసం భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ యాక్టర్

వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. అయితే నేటి కాలంలో మాత్రం కారణం చిన్నదైనా కానీ విడపోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక సినిమా రంగంలో అయితే ఈ తంతు షరా మామూలే. ఇద్దరికీ సెట్ అవ్వట్లేదని ఇలా ఏదో ఒక కారణం చెబుతూ సెలబ్రిటీలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఓ ప్రముఖ నటుడు మాత్రం తన భార్యకు విడాకులు ఇచ్చి న కారణం తెలిస్తే ఇదేందయ్యా ఇది అని ఖచ్చితంగా షాక్ అవ్వడం పక్కా.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణోదయ్ సింగ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. 2009లో 'సికిందర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత యే సాలి జిందగీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే జిస్మ్ 2, మై తేరా హీరో, మిస్టర్.ఎక్స్, మోహెంజో దారో, బ్లాక్‌మెయిల్ వంటి సినిమాల్లో నటించారు. ఇక అఫ్రాన్ వెబ్ సిరీస్‌లో అతని నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు పర్సనల్ లైఫ్ మ్యాటర్ తో మాత్రం హాట్ టాపిక్ గా మారాడు.

star actor who divorced his wife for a dog

అరుణోదయ్ సింగ్.. కెనడియన్ అమ్మాయి లీ ఎల్టన్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2016 డిసెంబర్ 13న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే అరుణోదయ్‌కి కుక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలు ఉండేవి. కానీ వాటి అరుపులు, గోల లీ ఎల్టన్‌కు చిరాకు తెప్పించాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయట. చివరికి ఆ గొడవలు బంధం తెగే వరకు లాగారు. దీంతో విడాకులు తీసుకోవడమే మంచిదని ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోయారట. డివోర్స్ తీసుకుని ఆరేళ్లు గడుస్తున్నా.. కుక్కలంటే మాత్రం ఇప్పటికీ అంతే ప్రేమ ఉందని చెబుతున్నారు.

దీంతో కుక్కల కారణంగా విడిపోవడం ఏంటని బీ టౌన్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు అరుణోదయ్ కుటుంబం గురించి చెప్పాలంటే.. ఆయన తాత అర్జున్ సింగ్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి అజయ్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే రాజకీయ కుటుంబంలో పుట్టినా అరుణోదయ్ మాత్రం యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ పెంచుకొని నటుడు కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+