మెగా కాంపౌండ్‌లోకి స్టార్ యాంకర్ ఎంట్రీ..!
మెగా ఫ్యామిలీ ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు. అరడజనకు పైగానే మెగా హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారి లిస్ట్ తీస్తే పెద్దదిగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ యాంకర్ మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ స్టార్ యాంకర్ మరెవ్వరో కాదు..శ్రీముఖి. వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటిస్తూ శ్రీముఖి తెగ సందడి చేస్తోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే... తెలుగు యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి.. తొలుత కొన్ని సినిమాల్లో నటించింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. వెండితెర కన్నా బుల్లితెరపై శ్రీముఖి సూపర్ హిట్ అయింది.

పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. బుల్లితెర మీదన వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శ్రీముఖి ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహారిస్తోంది. ఓ పక్క టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. మెగా హీరో అల్లు అర్జున్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి..ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించి అభిమానులకు షాకిచ్చింది. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి తళుక్కున మెరిసింది. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా శ్రీముఖి ఓ సాంగ్‌లో కనిపించనుంది.మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధమే ఆమెకు ఈ ఛాన్స్ తెచ్చిపెట్టిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా కాంపౌండ్‌లోకి శ్రీముఖి ఈజీగానే ఎంట్రీ ఇచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications