స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం..

ప్రముఖ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత దేబ్ ముఖర్జీ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 83 ఏళ్లు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ముఖర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. దేబ్ ముఖర్జీ మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ముఖర్జీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ముంబైలోని పవన్‌ హన్స్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

కుటుంబ నేపధ్యం..

దేబ్ ముఖర్జీకి రెండు పెళ్లిళ్లు కాగా.. రెండో భార్య సంతానమే ప్రముఖ డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ. ఇక హీరోయిన్లు కాజోల్‌, రాణి ముఖర్జీలు ఆయనకు మేన కోడళ్లు వరుస అవుతారు.

star-director-ayan-mukherjee-father-deb-mukharjee-passed-away

సినీ కెరీర్..

1960, 70 లలో దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించారు. ఏక్ బార్ మూస్కురా దో, జో జీతా వోహి సికందర్, లాల్ పత్తర్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. అధికార్‌, సికిందర్‌, అన్సూబాన్‌ గయే ఫూల్‌, దో ఆంఖేన్‌, అభినేత్రి, బాటన్‌ బాటన్‌ మే, కమినీ, గుడ్గునీ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలతో పాటు ముంబై సాంస్కృతిక రంగంలో కూడా దేబ్ ముఖర్జీ ముఖ్య పాత్ర పోషించారు.

ఇక అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే 2009లో 'వేక్ అప్ సిద్''తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 2013లో రొమాంటిక్ కామెడీ-డ్రామా 'యే జవానీ హై దీవానీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ లతో తెరకెక్కించిన 'బ్రహ్మస్త్ర' భారీ కలెక్షన్స్ సాధించింది. కాగా అయాన్ ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లతో వార్ 2 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మరణంతో ఆయన అయాన్‌ కొన్ని రోజులు వార్‌ 2 షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చే అవకాశం ఉంది.

దేబ్ ముఖర్జీ అంత్యక్రియలకు కాజోల్‌, అజయ్‌ దేవగన్‌, రాణి ముఖర్జీ, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, తనీషా, తనూజ, హృతిక్ రోషన్, సిద్ధార్త్‌ మల్హోత్రా వంటి ప్రముఖులు హజరు అవుతారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం ఆయనకు తుది నివాళి అర్పించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+