నితిన్‌పై చేయి చేసుకున్న దర్శకుడు
యంగ్ హీరో నితిన్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉందనే చెప్పాలి. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తరువాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.
నితిన్ చివరి సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉంటే నితిన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితిన్‌పై ఓ డైరెక్టర్ చేయి చేసుకున్నారనేది ఈ వార్త సారాంశం. నితిన్‌పై చేయి చేసుకున్న దర్శకుడు మరెవ్వరో కాదు తేజ.

నితిన్ మొదటి సినిమాకు తేజనే దర్శకత్వం వహించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నితిన్‌కు సరిగా సీన్ చేయడం రాకపోతే ఆయనపై చేయి చేసుకున్నాడట దర్శకుడు. యాక్టింగ్ విషయంలో తేజ ఎవరినైనా కొడతారనే విషయం అందరికి తెలిసిందే. తన గత సినిమాల్లోని హీరోయిన్లపై కూడా చేయి చేసుకున్నానని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అదే విధంగా నితిన్ మీద కూడా చేయి చేసుకున్నట్టుగా వార్తలైతే వచ్చాయి. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. నితిన్ ప్రస్తుతం ''తమ్ముడు'' సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటుగా వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న ''రాబిన్ హుడ్'' అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలైనా నితిన్ కెరీర్‌కు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.












Click it and Unblock the Notifications