జానీ మాస్టర్ వివాదంలోకి స్టార్ దర్శకుడు..?
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తనని కొద్దికాలంగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.ఆయన తొలుత నార్త్ ఇండియాలో ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులను జానీ మాస్టర్ బురిడీ కొట్టించి పారిపోయారని తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
జానీమాస్టర్ లడఖ్‌లో ఉన్నట్టు సమాచారంతో పోలీసు బృందాలు లడఖ్ బయలుదేరాయి. మరోవైపు మైనల్ బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదైంది. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితమే సదరు మహిళతో జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరే కొరియోగ్రాఫర్ టీంలోకి సదరు మహిళా కొరియోగ్రాఫర్ వెళ్లడం జరిగింది. ఓ పెద్ద హీరో సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ అక్కడకు వెళ్లి ఆమెతో గొడపడినట్టు తెలుస్తోంది.

గొడవ పెద్దది కావడంతో వీరిద్దర్ని ఓ తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ దర్శకుడు పిలిచించి మాట్లాడినట్టు సమాచారం. వారిద్దర్ని రాజీ చేసుకోవాలని సదరు దర్శకుడు సూచించారట. కుదరకపోతే మీ పని మీరు చేసుకోండని.. అంతే కానీ ఇలా రోడ్డున పని అల్లరి కావొద్దంటూ వారిని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయినా తీరు మార్చుకొని జానీ మాస్టర్ ఆ మహిళా కొరియోగ్రాఫర్‌ను వేధిస్తూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సీరియస్‌గానే రియాక్ట్ అయింది. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి, బాధితురాలికి అండగా నిలవడం జరిగింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. మరోవైపు జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications