విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్?
వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. అదిగో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. అని చెప్పుకునేలోగా.. అదిగో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంట అంటూ మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు చాక్లెట్ కొని చప్పరించినింత సులువుగా ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నారు. భార్యాభర్తల పటిష్ట బంధానికి, సాంప్రదాయకతకు వేదికలాంటి భారతదేశంలో రోజురోజుకు విడాకుల సంఖ్య పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వివిధ రంగాల్లోని పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులంతా విడాకుల బాట పడుతున్నారు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. అత్యధిక ఖర్చుతో భారీలెవల్లో తన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.. అంతేకాదు.. వాటిద్వారా బ్లాక్ బస్టర్ హిట్లు, సూపర్ హిట్లు అందుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ డైరెక్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన తర్వాత హద్దులు మీరుతున్నట్లు తెలుస్తోంది.

భార్యను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తుండటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారట. అయితే డైవోర్స్ తీసుకోవడంవల్ల సమాజంలో హోదా దెబ్బతింటుందని, గౌరవానికి భంగం వాటిల్లుతుందనే భయంతో ఆ డైరెక్టర్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మనస్పర్థలు రోజురోజుకు పెరుగుతుండటంతో పనిపై కూడా ఆ డైరెక్టర్ కు ఏకాగ్రత కుదరడంలేదంటున్నారు. మొత్తానికి పాన్ ఇండియా స్టేటస్ మాత్రం సదరు దర్శకుడిని ఇబ్బందులు పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications