ఆ హీరోతో క్లోజ్‌గా ఉండటంతో హీరోయిన్ స్నేహను కొట్టిన స్టార్ దర్శకుడు..?
హీరోయిన్ స్నేహ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ స్నేహను ఇప్పటికి కలల దేవతగానే చూస్తారు.సినిమాల్లోకి వచ్చిన కొత్తలో స్నేహ సాంప్రదాయమైన పాత్రలు చేస్తూ సౌందర్య అంతటి గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్ చేసే పాత్రల్లో నటించకుండా సాంప్రదాయమైన పాత్రలతోనే ప్రేక్షకుల్లో ఆదరణ పొందింది.
రవితేజ, వెంకటేష్ , శ్రీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్నేహ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో స్నేహ నటించారు. కెరీర్ పీక్ టైంలోనే ఉండగానే తమిళ నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకున్నారామె.పెళ్లి తరువాత కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఇదిలా ఉంటే స్నేహ ఓ హీరోను ప్రేమించిందనే కారణంతో ఓ దర్శకుడు ఆమెపై చేయి చేసుకున్నాడనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగారు సుశీ గణేషన్.

ఆయన దర్శకత్వంలోనే స్నేహ చాలా సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే స్నేహ హీరోయిన్‌గా ఫేమస్ కావడంతో సుశీ గణేషన్‌ని పట్టించుకోలేదట. స్నేహను గాఢంగా ప్రేమించారట సుశీ గణేషన్. ఇదే సమయంలో స్నేహ నటుడు ప్రశాంత్‌తో ఆమె క్లోజ్ మూవ్ అవ్వడంతో ఆమెపై దాడికి దిగారట సుశీ గణేషన్.ఆ దాడిలో స్నేహ కి కాస్త గాయాలు కూడా అయ్యాయట. అయితే ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తీసుకువెళ్లారట.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications