రక్తం వచ్చేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో.. వద్దన్నా వినకుండా రెచ్చిపోయాడు
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో షూటింగ్‌లో హీరోయిన్ పెదవి కొరికారట.దర్శకుడు కట్ చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా సీన్‌లో లీనమైపోయాడట సదరు హీరో.

ఆ హీరో మరెవరో కాదు వినోద్ ఖన్నా. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు మాధురీ దీక్షిత్.ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ మధ్య జరిగిన ఒక ముద్దు సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 'దయవాన్' సినిమా చిత్రీకరణ సమయంలో ఒక ముద్దు సీన్‌లో వినోద్ ఖన్నా పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే, దర్శకుడు "కట్" చెప్పినా కూడా ఆయన ఆగలేదని సమాచారం. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ పెదవిని గట్టిగా కొరకడంతో ఆమె పెదవి చిట్లి రక్తం కారిందట. ఈ సంఘటనతో సెట్‌లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. నొప్పి తట్టుకోలేక మాధురీ దీక్షిత్ ఏడుస్తూ సెట్ నుండి వెళ్లిపోయారట.
అయితే, ఆ తర్వాత దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌తో పాటు వినోద్ ఖన్నా కూడా మాధురీ దీక్షిత్‌కు క్షమాపణలు చెప్పడంతో ఆమె సినిమా షూటింగ్ పూర్తి చేసింది.అయితే సినిమా విడుదలైన తర్వాత, ఆ ముద్దు సన్నివేశంపై పలు వివాదాలు తలెత్తాయి. దీంతో మాధురీ దీక్షిత్ స్వయంగా దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌ను కలిసి ఆ సన్నివేశాన్ని తొలగించమని విజ్ఞప్తి చేశారు. కానీ, ఫిరోజ్ ఖాన్ మాత్రం "ఈ సన్నివేశమే సినిమాకు హృదయం, ప్రేక్షకులు దీని వల్లే సినిమాకు వస్తారు" అని చెప్పి తొలగించడానికి నిరాకరించారట. ఆ సీన్‌ను సినిమాలో కొనసాగించడం కోసం హీరో, దర్శకుడు కలిసి దాదాపు రూ.1 కోటి వరకు అదనంగా ఖర్చు చేశారని సమాచారం.
-
నా కథను మానభంగం చేసేశారు..! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
నో గ్యాప్- షూటింగ్ రెజ్యూమ్ పెళ్లి తర్వాత తొలిసారి కెమెరా ముందుకు విజయ్, రష్మిక -
రామ్‌చరణ్ చేయనంటే అల్లు అర్జున్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
తెలుగు సినీ పరిశ్రమలో శత్రుత్వాలు వీరి మధ్యేనా? -
రజనీకాంత్, ధనుష్‌లకు పొరుగున.. కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
ఒకటి ఫుల్ క్లాస్.. ఇంకోటి ఊర మాస్.. ఫుల్ జోష్ లో యంగ్ హీరో !! -
"రేప్" చేస్తామంటూ రోజూ బెదిరిస్తున్నారు..! -
బిగ్ షాక్ ఇచ్చిన మరో స్టార్ సింగర్.. ఇకపై స్టాప్ ! -
ఈ యంగ్ హీరో ఏమైపోయాడో.. రెండేళ్ల నుంచి నో అప్డేట్ !!












Click it and Unblock the Notifications