Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టార్ హీరో మీద భార్య, గర్ల్ ఫ్రెండ్ ప్రభావం పడినా ఆ సినిమా మాత్రం ?, లెక్కమారింది !

ఫ్యామిలీ ఫైట్ తో స్టార్ హీరో సతమతం అవుతున్నాడు. ఫ్యామిలీ గొడవలతో మీడియా ముందుకు, అభిమానుల ముందుకు రాలేక ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోకు ఆయన నటించిన సినిమా భారీ మొత్తంలో కలెక్షలు వసూలు చెయ్యడంతో కొంచెం ఊపిరిపీల్చుకుంటున్నారు. భార్య విజయలక్ష్మి, స్నేహితురాలు పవిత్రా గౌడల మధ్య జరిగిన గొడవతో స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ తో పాటు ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది.

సోషల్ మీడియాలో పలువురు హీరో దర్శన్ భార్య విజయలక్ష్మికి మద్దతు తెలుపుతున్నారు. పవిత్రా గౌడ్‌కు మరికొందరు మద్దతు తెలిపారు. ఇలా ఇద్దరు మహిళలకు ఒకే హీరో అభిమానులు వేర్వేరుగా మద్దతు తెలుపుతున్నారు. ఫ్యామిలీ వార్ తో చాలెంజింగ్ స్టార్ డీ బాస్ దర్శన్ జీవితం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అభిమానులతో పాటు స్యాండిల్ వుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Star hero Darshans family quarrels are not having any effect on the movie Katera

హీరో దర్శన్ ఫ్యామిలీ వివాదం మధ్య కాటేరా సినిమా కలెక్షన్లు ఆ హీరోకు, ఆయన అభిమానులకు ఊరటనిచ్చింది. సంసార కలహాల వల్ల అసహనం, అసంతృప్తి మధ్య ఉన్న స్యాండిల్ వుడ్ హీరో దర్శన్ కు మాత్రం కాటేరా సినిమా కలెక్షన్లు కొంచెం ​​ఆనందాన్ని తెచ్చిపెట్టింది. విడుదలైనప్పటి నుంచి కాటేరా స్యాండిల్ వుడ్ లో పదికి పైగా రికార్డులను బద్దలు కొట్టింది. కటేరా సినిమా ఇప్పుడు ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ప్రత్యేకించి ఈ ఐదు వారాల్లో ఎన్నో పరభాషా సినిమాలు విడుదలయ్యాయి.

ఎన్ని పరభాషా సినిమాలు విడుదల అయినా ఆ ప్రభావం కాటేరా మీద పడకపోవడంతో డీ బాస్ కంపెనీ టీమ్ హ్యాపీగా ఉంది. ఎన్ని సినిమాలు విడుదల అయినా కాటేరా కలెక్షల పరంగా నిలకడగా థియేటర్లలో బలంగా పాతుకుపోయింది. నేటికీ కాటేరా చిత్రానికి క‌ర్ణాట‌క‌లో డిమాండ్ పెరిగిపోతున్నది. ఇందుకు నిదర్శనంగా ఒక్క బెంగళూరులోనే యాభైకి పైగా స్క్రీన్లలో కాటేరా సినిమా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ మైసూర్‌లో 28 పైగా స్క్రీన్‌లలో కాటేరా సినిమా ప్రదర్శించబడుతోంది.

ప్రస్తుతానికి కాటేరా మూవీకి ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ఈజీగా 50 రోజులు కంప్లీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా కాటేరా సినిమా వసూళ్ల విషయానికి వస్తే రాక్ లైన్ వెంకటేష్ అండ్ టీమ్ మాత్రం లాభ లెక్కలను అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. సోషల్ మీడియాలో సినీ విశ్లేషకులు, లెక్కల పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది.

Star hero Darshans family quarrels are not having any effect on the movie Katera

బాలీవుడ్ ఫైటర్ ఇటీవల విడుదల అయ్యింది. హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు కర్ణాటకలోని 550కి పైగా స్క్రీన్లలో ఫైటర్ సినిమా షోలు ప్రదర్శించబడింది. అయినప్పటికీ కాటేరాను ఫైటర్ సినిమా ఏమాత్రం ప్రభావితం చెయ్యలేకపోయింది. కాటేరా కలెక్షలు ఏమాత్రం తగ్గలేదు. ఎన్నిసినిమాలు విడుదల అయినా కాటేరా కలెక్షలు మాత్రం వెనుకపడలేదు.

మొత్తానికి కాటేరా ఇప్పుడు ఐదో వారంలోకి అడుగుపెట్టి వెండితెరపై హల్చల్ చేస్తోంది. కాటేరా సినిమాతో హీరో దర్శన్‌ ఆయన అభిమానుల ఉత్సాహాన్ని పెంచాడు. కాటేరా 50 రోజుల వేడుకలను చిత్ర బృందం ఎలా జరుపుకుంటుందో వేచి చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. హీరో దర్శన్ ఫ్యామిలీ ఫైటింగ్ కాటేరా సినిమా మీద ఏమాత్రం పడలేదని స్యాండిల్ వుడ్ ప్రముఖులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+