అల్లు అర్జున్ కు పోటీగా వారిద్దరికీ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్?
సినీ పరిశ్రమ అన్న తర్వాత ఎన్నో రాజకీయాలుంటాయి. అలగే గ్రూపులు కూడా ఉంటాయి. ఒక్కో హీరోది ఒక్కో గ్రూప్. కొంతమంది వారి వారి సౌలభ్యాన్ని బట్టి ఆ గ్రపుల్లో చేరిపోతుంటారు. సినిమా హీరో అన్న తర్వాత తన సినిమాలో ఉండే చిన్న చిన్న పాత్రలకు కొంతమంది కోసం డైరెక్టర్ కు హీరోలు రికమెండ్ చేస్తుంటారు. దీంతో కొందరు నటులు కూడా ఆయా హీరోలకు మద్దతుగా మెసులుతుంటారు. రాజకీయాలకు ఆలవాలమైన సినీ పరిశ్రమలో పైకి అందరూ బాగానే ఉంటారు. కానీ లోపల మాత్రమే ఎవరికివారుగా వారు చేయాల్సింది చేస్తుంటారు.
టిల్లు స్క్వేర్ సక్సెస్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సిద్ధు జొన్నలగడ్డకు, విశ్వక్ సేన్ కు తారక్ ఎంతో మద్దతిస్తున్నారు. వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు. యంగ్ హీరోలను స్టార్ హీరోలు బాగా ఎంకరేజ్ చేస్తుండటం అనేది సాధారణంగా జరుగుతుండేదే. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండను బాగా ప్రోత్సహిస్తూ అతని ఫంక్షన్లకు అల్లు అర్జున్ కచ్చితంగా హాజరయ్యేవారు. స్టేజీ ఎక్కిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో విజయ్ దేవుకొండమీద వ్యతిరేక భావం పెరిగిపోయింది.

బేబీ సినిమాకు సంబంధించిన వివాదంలో విశ్వక్ సేన్ చిక్కుకున్నప్పుడు అతన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల విశ్వక్ బాగా ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ తీసుకుంటూ వస్తున్నాడు. విజయ్ దేవరకొండను అల్లు అర్జున్ బాగా సపోర్టు చేస్తుండటంతో విశ్వక్ ను బన్నీకి వ్యతిరేకంగా తారక్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడని చెబుతున్నారు. అటు అల్లు అర్జున్ కానీ, ఇటు తారక్ కానీ ఎవరికివారుగా వారికి నచ్చిన హీరోలకు మద్దతుగా ఉంటూ సర్కిల్ ను తయారుచేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ పేరు చెబితే బన్నీ, విశ్వక్ పేరు చెబితే తారక్ గుర్తుకు వస్తారు. విశ్వక్ కు, విజయ్ కు విభేదాలున్నాయి. ఎవరికివారు స్టార్ హీరోల మద్దతు తీసుకుంటున్నారు. తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. బావా బావా అని పిలుచుకుంటుంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications