పని మనిషిపై అత్యాచారం చేసిన స్టార్ హీరో

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలగాల్సిన హీరో పని మనిషిపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లాడు. దీంతో అతని కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇలా పని మనిషిపై ఘాతుకానికి పాల్పడిన హీరో మరెవరో కాదు.. షైనీ అహుజా. ఇప్పటి తరానికి షైనీ అహుజా గురించి పెద్గా తెలియకపోవచ్చు కానీ, 2000ల్లో యూత్‌కు అహుజా బాగా సుపరిచితుడే. బాలీవుడ్‌లో ఫ్యూచర్ స్టార్‌గా షైనీ అహుజా పేరు బాగా వినిపించింది.

2000వ దశకంలో తన అరంగేట్రం చేసిన షైనీ, "హజారోన్ ఖ్వాయిషేన్ ఐసి" (Hazaaron Khwaishein Aisi), "గ్యాంగ్‌స్టర్" (Gangster), "వో లమ్హే" (Woh Lamhe) వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందారు. అతని నటనకు మంచి గుర్తింపు లభించింది, ముఖ్యంగా విభిన్నమైన పాత్రలను పోషించడంలో అతని సామర్థ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని కెరీర్ ఉన్నత స్థాయికి చేరుతుందని అంతా భావించారు.

Star hero who raped a maid

అయితే, 2009లో షైనీ అహుజా జీవితం, కెరీర్ ఒకేసారి తలకిందులైపోయాయి. తన పనిమనిషిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీవ్ర విచారణ అనంతరం, 2011లో ముంబై కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన షైనీ అహుజా కెరీర్‌కు దాదాపు ముగింపు పలికింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా, అతని పూర్వ వైభవం తిరిగి రాలేదు. ఒక నటుడిగా అతని ప్రకాశవంతమైన భవిష్యత్తు, ఈ చీకటి కేసుతో కనుమరుగైపోయింది. షైనీ అహుజా కెరీర్ విజయానికి, పతనాన్నికి మధ్య జరిగిన ఒక విషాద గాథగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+