'గేమ్ ఛేంజర్' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు.

రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడు. స్టూడెంట్, , పోలీస్ , ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడుగా, ఇలా విభిన్నపాత్రల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే దర్శకుడు శంకర్ తొలుత 'గేమ్ ఛేంజర్' సినిమాను మరో హీరోకు వినిపించాడట. ఆ హీరో మరెవ్వరో కాదు.. తమిళ స్టార్ హీరో విజయ్. కథ కూడా నచ్చడంతో విజయ్ సైతం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే శంకర్ పెట్టిన కండీషన్ కారణంగానే విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.సినిమా షూటింగ్ కోసం ఏడాదిన్న‌ర పాటు సమయం అడిగారట శంకర్.

star hero who rejected the movie Game Changer

కానీ, విజయ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డంతో.. సినిమాకు ఒక సంవ‌త్స‌రం కంటే ఎక్కువ‌ స‌మ‌యం ఇవ్వ‌లేన‌ని చెప్పార‌ట‌. దీంతో శంక‌ర్ ఈ సినిమాకు విజ‌య్‌ను ప‌క్క‌న పెట్టి, రామ్ చరణ్‌ను సెలక్ట్ చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో విజయ్ గోట్ అనే మూవీని చేసి ఘోరమైన ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఆయన తన చివరి చిత్రాన్ని ఇటీవలే మొదలుపెట్టం జరిగింది. ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికి వస్తే.. సినిమాలో విలన్‌గా ఎస్‌జె సూర్య కనిపించబోతున్నారు. ఇక తమన్ అందించిన బీజీఎమ్‌ ఆకట్టుకుంది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫ్లాప్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' భారీ హిట్‌గా నిలపలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. 'గేమ్‌ ఛేంజర్' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.జనవరి 10వ తేదీన 'గేమ్‌ ఛేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తర్వాత 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+