ఆ క్రికెటర్ మోజులో పడి గర్భవతైన స్టార్ హీరోయిన్..భర్తను సైతం వదిలేసి
సినీ ఇండస్ట్రీలో రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు.కొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోగా, మరికొందరు వివాహం చేసుకుని తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. అయితే హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ఓ క్రికెటర్ మాత్రం విడాకుల బాట పట్టారు. తాజాగా ఓ హీరోయిన్ సీనియర్ క్రికెటర్‌తో దర్శనం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే ఓ హీరోయిన్ ఏకంగా క్రికెటర్ మోజులో పడి అతని వల్ల తల్లైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..నీనా గుప్తా. ఈ తరం ప్రేక్షకులకు నీనా గుప్తా గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1980ల్లో నీనా గుప్తా అంటే తెలియని అభిమాని ఉండేవారు కాదు. నీనా గుప్తా కేవలం తన నటనతోనే కాకుండా, తన బోల్డ్ నిర్ణయాలు, సంక్లిష్ట వ్యక్తిగత జీవితంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. సంప్రదాయాలకు అతీతంగా, తనదైన శైలిలో జీవితాన్ని గడిపిన ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.

నీనా గుప్తా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమె మొదట 1977లో అమలన్ కుసుమ్ ఘోష్‌ను వివాహం చేసుకున్నారు, అయితే అది తక్కువ కాలమే కొనసాగింది.ఆమె జీవితంలో అత్యంత సంచలనాత్మక ఘట్టం 1980వ దశకంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్తో ఆమెకున్న సంబంధం.
అప్పటికే వివాహితుడైన వివియన్ రిచర్డ్స్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోనప్పటికీ, వారికి మసాబా గుప్తా అనే కుమార్తె జన్మించింది. నీనా గుప్తా ఒంటరి తల్లిగా మసాబాను పెంచాలని ధైర్యంగా నిర్ణయించుకున్నారు. సమాజం నుంచి ఎన్నో విమర్శలు, సవాళ్లు ఎదురైనా, ఆమె తన నిర్ణయానికి కట్టుబడి నిలిచారు. తన ఆత్మకథ 'సచ్ కహూన్ తోహ్' లో ఈ విషయాలన్నింటినీ నిర్మొహమాటంగా పంచుకున్నారు. మసాబా తండ్రి వివియన్ రిచర్డ్స్ తన బిడ్డను కనమని ప్రోత్సహించారని, తల్లిగా తన నిర్ణయాన్ని ఆయన గౌరవించారని ఆమె తెలిపారు.
ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత, 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. ఆమె 50 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వారు సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications