నడిరోడ్డుమీద వేధింపులకు గురయిన స్టార్ హీరోయిన్..
సమాజంలో అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎక్కడో ఒకచోట వేధింపులకు గురువుతున్నారు. తాజాగా, టాలీవుడ్ నటి కీర్తిసురేష్ నడిరోడ్డుమీద తనకు ఎదురయిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మహానటి నటికి కూడా తప్పని వేధింపులు : నటి కీర్తీసురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సాధించుకున్నారు. మహానటి వంటి సినిమాల్లో నటించి తనలోని నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్‌లతో నటించారు. ప్రిన్స్ మహేష్‌బాబుతో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర సినిమాల్లో కూడా నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.

కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా చెల్లెల్లి పాత్రలో కూడా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో చేసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానీతో నటించిన సినిమా దసరా మంచి విజయాన్నే అందించింది. ఆ సినిమా భారీ వసూళ్లనే రాబట్టింది. దసరా మూవీలో కీర్తి సురేష్ నటించిన వెన్నెల పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలోని ఓపాటలో కీర్తిసురేష్ డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నారు. వరుణ్ ధావక్ జోడిగా ఓ సినిమా చేయనున్నారు కీర్తిసురేష్.
అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతు : అయితే, తాజాగా కీర్తిసురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు. గతంలో కీర్తిసురేష్ వేధింపులకు గురయినట్లు స్వయంగా ఆమె వెల్లడించడం జరిగింది. ఈ విషయంపై కీర్తి సురేష్ మాట్లాడుతూ, కాలేజీలో చదుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాము. ఇంతలో ఒక తాగుబోతు వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా మీదకు రాబోతే, నేను ఆ తాగుబోతును కొట్టాను. వెంటనే ఆ తాగుబోతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడని కీర్తి సురేష్ అన్నారు. అయితే, ఆ వయసులోనే కీర్తి సురేష్ చూపిన ధైర్యానికి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.












Click it and Unblock the Notifications