త్రివిక్రమ్ ఓ యూజ్‌లెస్ ఫెలో
ఇటీవల కాలంలో బాగా విమర్శలు ఎదుర్కొన్న దర్శకుల్లో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. మహేష్ బాబులాంటి స్టార్ హీరోను పెట్టుకుని సరైన కథ లేకుండా సినిమా తీయడంపై అభిమానులు గురూజీపై గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే త్రివిక్రమ్,హీరోయిన్ పూనమ్ కౌర్‌ల మధ్య విభేదాలున్న సంగతి అందరికి తెలిసిందే.
పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ విషయంలో పూనమ్ కౌర్‌కు త్రివిక్రమ్ అడ్డుపడ్డారనే టాక్ సినీ వర్గాల్లో నడుస్తోంది. అప్పటి నుంచి కూడా వీలు కుదిరినప్పుడల్లా త్రివిక్రమ్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారామె. తాజాగా పూనమ్ కౌర్ మరోసారి త్రివిక్రమ్‌పై ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయ సభలో మాట్లాడుతూ.. వైసీపీ వారు 'సిద్ధం' అంటే నేను 'యుద్ధం' అని అనాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి పంచ్ డైలాగులు సినిమాల్లోనే సరిగా చెప్పలేను.

త్రివిక్రమ్‌గారు అత్తారింటికి దారేదిలో "సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా" డైలాగ్ చెప్పమంటే, నా బాధ భరించలేక కామెడీగా చెప్పామన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. తాజాగా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ ఓ పనికిమాలినోడు అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసినవారంతా కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాళ్లు 'సిద్ధం' అంటే నేను 'యుద్ధం' అని అనాలని expect చేస్తున్నారు.. అలంటి పంచ్ డైలాగులు సినిమాల్లో కూడా సరిగ్గా చెయ్యను.#Trivikram గారు అత్తారింటికి దారేదిలో "సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా" డైలాగ్ చెప్పమంటే, నా బాధ భరించలేక కామెడీ గా చెప్పామన్నారు..
— Gulte (@GulteOfficial) February 21, 2024
- #PawanKalyan pic.twitter.com/9pxEI3s9iM












Click it and Unblock the Notifications