ఆ మెసేజెస్ పట్టించుకోవద్దు, లింక్స్ ఓపెన్ చేయొద్దని ఫ్యాన్స్ కి స్టార్ సింగర్ రిక్వెస్ట్..
స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ గరించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మధుర గాత్రం సంగీత ప్రియులను అలరిస్తున్నారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం సహా పలు భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్ లుగా మారుమోగుతూనే ఉంటున్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు ఈ గాయని.
అయితే తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది శ్రేయా ఘోషల్. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. దయచేసి ఆ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి పోస్టులను, లింక్స్‌ని క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేమేజ్‌లకు రెస్పాండ్ అవ్వకండని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఫిబ్రవరి 13వ తేదిన నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారని.. రిపోర్టు చేసేందుకు ప్రయత్నించానని ఆ పోస్టులో రాసుకోచింది. ఆటో జనరేటెడ్ రెస్పాన్స్‌ల వల్ల పరిష్కారం దొరక లేదని.. అకౌంట్‌ని డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ దొరకాదం లేదంటూ వాపోయారు.
శ్రేయా ఘోషల్.. పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటివరకు దాదాపు 25000లకు పైగా పాటలు పాడింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే రీసెంట్ గానే అగ్నిపథ్ మూవీలోని చికినీ చమేలీ అనే పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్టు తెలిపింది. ఐటెమ్ సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతుంటారని.. చిన్న పిల్లలు కూడా వాటి అర్థమేంటో తెలియకుండా పాడేస్తున్నారని అన్నారు. ఓ ఐదారేళ్ల పిల్ల అలాంటి లిరిక్స్ పాడటం సరికాదు అని శ్రేయా ఘోషాల్ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications