మెగాస్టార్‌ ఇంట్లో బస చేసే ఛాన్స్‌.. ఒక్క రోజుకు ఎంతో తెలుసా..?

అభిమానులు తమ ఫేవరేట్ హీరోల్ని తాకాలని.. వారితో సెల్ఫీలు తీసుకోవాలని తెగ ఆరాట పడుతుంటారు. వారితో క్షణమైనా గడిపితే చాలని అనుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. తమ అభిమాన హీరోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అని ఇళ్లు, స్టూడియోల ముందు గంటల తరబడి ఎదురుచూస్తూంటారు. అలాంటి వారికి ఇదో బంపర్ ఆఫర్. సాధారణమైన హీరో కాదు. ఏకంగా మెగాస్టార్ ఇంట్లోనే బస చేసే అవకాశం దొరికితే.. ఎగిరి గంతేస్తారు కదూ.. అయితే ఈ ఆఫర్ మీకోసమే.

మలయాళ మెగాస్టార్‌ ముమ్ముట్టి ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్‌, కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ , కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ముమ్ముట్టి ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. అయినా పాత ఇంటికి అప్పుడప్పుడూ వస్తూ పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటారట.

ఈ క్రమంలోనే ఆయనకు అద్బుతమైన ఆలోచన వచ్చింది. పాత ఇంటిని ఎవరూ లేకుండా అలా ఉంచడం ఇష్టం లేని ముమ్ముట్టి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకారం.. అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్‌ గదిలో సేద తీరొచ్చు. ముమ్ముట్టి ఇంట్లోని ప్రైవేట్‌ థియేటర్‌, గ్యాలరీ రూమ్‌ చూసేందుకూ వీలుంటుందట. అయితే ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్‌ 1 నుంచి బుకింగ్స్‌ మొదలుపెడతారన సమాచారం.

Stay at Malayalam Megastar Mammootty s House for Rs 75 000 a Day

ఇక ప్రస్తుతం ముమ్ముట్టి వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులోనూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. గతేడాది టర్బో, భ్రమయుగం చిత్రాలతో అలరించిన ముమ్ముట్టి.. ప్రస్తుతం డోమినిక్ అండ్ లేడిస్ పర్స్, భజూక మూవీస్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+