కెరీర్ పీక్స్ లోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. కారణం అదేనా ?
చిత్రపరిశ్రమలో ఎప్పుడూ వెలుగులో ఉండే గ్లామర్ లైట్స్ వెనకాల, కనిపించని చీకటి కోణాలు కూడా ఉంటాయి. నటన వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల పరంగా సూపర్ ఫామ్ లో ఉన్నా.. చిత్రాలు ఏమి లేకపోయినా కానీ నిజజీవితం అనేది ఎప్పుడూ మరో రకంగానే ఉంటుంది. అర్థం కాని ఒత్తిళ్లు, ప్రేమలో జరిగిన పొరపాట్లు, కెరీర్ పతనాలు, ఆర్దిక ఇబ్బందులు... ఇలా సమస్య ఏదైనా కానీ కొంతమంది నటీనటులు అర్ధాంతరంగా ముగింపు పలికిన ఘటనలు చాలానే ఉన్నాయి.
ఈ లిస్టులో సిల్క్ స్మిత, విజయలక్ష్మి, దివ్య భారతి సహా పలువురు నటీమణులు ఉన్నారు. అయితే ఆత్మహత్యాయత్నం చేసి అదృష్టవశాత్తు బయటపడి.. ఇప్పుడు జీవితాన్ని సాఫీగా గడుపుతోందీ ఓ ప్రముఖ నటి. ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆ నటి ఎన్టీఆర్ హీరోయిన్.

ఎన్టీఆర్ తో పలువురు హీరోయిన్స్ నటించినా కానీ ఆయన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా మాత్రం ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది. ఆ మూవీలో హీరోయిన్ గా నటించి మెప్పించింది 'గజాల'. 2001లో 'నాలో ఉన్న ప్రేమ' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1' భారీ హిట్ కొట్టడంతో తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2002లో సూసైడ్ అటెంప్ట్ చేసింది గజాల. 2002 జూలై 22న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన సహ నటులు సుల్తానా, అర్జున్ ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. బ్రతికి బయటపడింది. అయితే ఆమె ఆత్మహత్య ప్రయతానికి ప్రేమ వ్యవహారమే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ ఘటన తర్వాత గజాల కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. కలుసుకోవాలని, తొట్టి గ్యాంగ్, అల్లరి రాముడు, జానకి వెడ్స్ శ్రీరామ్, శ్రావణ మాసం, మల్లీశ్వరి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. చివరగా 2011 లో మనీ మనీ మోర్ మనీ చిత్రంలో నటించింది. ఇక ఆ తర్వాత నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

కొన్నేళ్ల క్రితం హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది గజాల. పెళ్లి తర్వాత సినిమాలకు ఇక పూర్తిగా దూరమైన ఈమె.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.












Click it and Unblock the Notifications