అల్లు అర్జున్ కొత్త స్టైల్ గమనించారా?
అల్లు అర్జున్ పేరు వినగానే తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అతని స్టైల్. పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ కొత్త కొత్త స్టైల్స్ ను పరిచయం చేస్తుండటాడు. ఒకరకంగా స్టైల్ అనే పేరుకు పర్యాయపదంగా నిలిచాడు. పరిశ్రమతోపాటు ఫ్యాన్స్ అంతా స్టైలిష్ స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చారు. స్టైలిష్ స్టార్ గా బాబా పాపులారిటీని తెచ్చుకున్నాడు. యువత అందుకే అల్లు అర్జున్ వెంట పడుతుంది.
ఎన్నో కొత్త స్టైల్స్ ను పరిచయం చేసిన బన్నీ తాజాగా తన కారు టైర్ల విషయంలో కూడా కొత్త స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. ఇది చూసి అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. షూటింగ్ కోసం తన కారులో అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ ను చూసిన అభిమానులు ఖుషీ అవడమే కాకుండా కారు టైర్లను ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఏదైనా కొత్తగా ఉండాలని, అలాగే స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటాడని చెబుతున్నారు. తన కారు టైర్లలో ఏ ఏ అనే లోగోను ముద్రించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని బన్నీ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో రాగా, రెండో భాగం పుష్ప ది రూల్ పేరుతో రాబోతోంది. చిత్రయూనిట్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ పుష్ప3 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పుష్ప3 ది రోర్ పేరుతో వస్తుందంటున్నారు. పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అట్లీ దర్శకత్వంలో చేస్తాడా? లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తాడా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications