Sudigali Sudheer: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..!

సుడిగాలి సుధీర్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. మెజిషియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. రామోజీ ఫిల్మి సిటీలో మ్యాజిక్ లు చేస్తూ ఉండే వాడు. అయితే జబర్దస్త్ సుధీర్ కెరీర్ నే మార్చేసింది. వేణు టీంలోకి అడుకు పెట్టిన సుధీర్ మంచి ఫర్మమెన్స్ తో ఆకట్టుకున్నాడు. వేణు జబర్దస్త్ నుంచి తప్పుకోగానే.. టీం లీడర్ గా మారి సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ బుల్లి తెరతోనే ఆగిపోలేదు.

వెండి తెరపై కూడా రాణిస్తున్నాడు. సైడ్ క్యారక్టర్ చేసిన సుధీర్ తర్వాత హీరోగా కూడా సినిమాలు తీశాడు. ఈ సినిమాల్లో సుధీర్ మంచి నటన ప్రదర్శించాడు. అయితే జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఉన్నారు. వీరిద్దరికి పెళ్లైంది. కానీ సుధీర్ ఇంకా పెళ్లి కాలేదు. దీంతో సుధీర్ వివాహం పై ఎప్పుడు చర్చ కొనసాగుతోంది. అయితే సుధీర్, రష్మి మధ్య ప్రేమ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Sudhir Sudheer seems to be getting married soon

వారు కూడా అలాగే నడుచుకునే వారు స్క్రీన్ పై కెమిస్ట్రీ పండించే వారు. ఇది చూసిన వారంతా నిజంగానే వారు లవ్ చేసుకుంటున్నారని అనుకున్నారు. కానీ వారు ప్రేమికులు కాదని స్నేహితులని తేలిపోయింది. దీంతో మరి సుధీర్ పెళ్లి చేసుకుంటాడా.. చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు. ఎప్పుడు చేసుకుంటాడు అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

సుధీర్ విదేశాల్లో చదువుతున్న తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సుధీర్ కుటుంబ సభ్యులు, అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహంపై చర్చించినట్లు చెబుతున్నారు. త్వరలోనే అమ్మాయి చదువు పూర్తి కాగానే పెళ్లి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో సుడిగాలి సుధీర్ పెళ్లి జరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+