రష్మికి షాక్..నిర్మాత కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్..?
సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్‌ను బుల్లితెర మెగాస్టార్‌గా పిలుస్తుంటారు. సుడిగాలి సుధీర్ ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్టే. జబర్థస్త్ షోతో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎదిగాడు. పోవే పోరా, ఢీ వంటి షోలకు యాంకరింగ్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తర్వాత వీరిద్దరు కలుసున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌లు కలిసి షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అదింతా కేవలం షోస్ రేటింగ్ రావడానికి మాత్రమే చేశామని రష్మి ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లికి రెడీ అవుతున్నారనే వార్త ఒకటి వైరల్ అవుతోంది. సుడిగాలి సుధీర్‌కు పెళ్లి కుదిరిందట.. అది కూడా ఇండస్ట్రీకి చెందిన బడా ప్రొడ్యూసర్ కూతురుతో అని తెలుస్తోంది.
సుడిగాలి సుధీర్ ట్యాలెంట్ చూసిన ఓ తెలుగు నిర్మాత, తన కూతుర్ని సుధీర్‌కు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారట. కోట్ల ఆస్తులకు వారసురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల సుడిగాలి సుధీర్ జాతకం మారిపోవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం సుధీర్ పెళ్లి గురించిన వార్త మాత్రం వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications