GOAT Movie Review: గోట్ మూవీ రివ్యూ.. సుడిగాలి సుధీర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?
జబర్దస్త్ షో లో కమెడియన్ గా బుల్లి తెరకు పరిచయమయ్యారు సుడిగాలి సుధీర్. తన కామెడీ టైమింగ్ తో, పంచ్ లతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు వెండితెరపై తన సత్తా చాటడానికి 'గోట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ నవంబర్ 12న విడుదలైంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ మూవీలో దివ్యభారతి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ క్రికెట్ బెట్టింగ్ మాఫియా, లవ్, కామెడీ, యాక్షన్ తదితర అంశాలతో రూపొందింది. మరి గోట్ మూవీ ప్రేక్షకులను అలరించిందా..? హీరోగా తొలి చిత్రంతో సుడిగాలి సుధీర్ విజయం సాధించారా..?
కోనసీమలోని రుద్రవరం గ్రామంలో వెంకట కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) పెద్దమనిషిగా ఉంటారు. ఆయన క్రికెటర్ కూడా.. అయితే అప్పటికే కోడి పందాలు, ఎద్దుల పందాలను జూదంగా మార్చేసిన ప్రజలు చివరకు క్రికెట్ ఆటకూ బెట్టింగ్ లు మొదలు పెడతారు. అయితే దానిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరోవైపు ఇదే గ్రామానికి చెందిన గణ (సుడిగాలి సుధీర్) జులాయిగా తిరుగుతుంటాడు. అయితే ఈజీ మనీ కోసం స్నేహితులతో కలిసి ఓ ఫేక్ కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో పొరపాటు కారణంగా సుభాషిణి (దివ్యభారతి) కిడ్నాప్ కు గురైతుంది. ఈ అనుకోని పరిణామం గణ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
ఈ నేపథ్యంలో సుభాషిణితో అతడి పరిచయం ప్రేమగా మారిందా..? బెట్టింగ్ మాఫియా గ్యాంగ్ తో గణకు ఎందుకు వైరం ఏర్పడింది..? బెట్టింగ్ మాఫియా నుంచి ఆయన గ్రామాన్ని కాపాడగలిగాడా..? లేదా..? అనేది మిగతా కథ. ఇక డబ్బు కోసం మొదలైన ఓ చిన్న కిడ్నాప్ ప్లాన్.. చివరకు ఓ మాఫియాను ఎదుర్కునే స్థాయికి చేరుకోవడం కథలో ఆసక్తికర పరిణామం అని చెప్పాలి.

ఇక ఈ మూవీలో సుడిగాలి సుధీర్ తన కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే సినిమాలో కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రం ఇది అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సుడిగాలి సుధీర్ ఈ సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నారు.












Click it and Unblock the Notifications
