తనిష్క్ జ్యూవెలరీలో భారీ దోపిడీ.. రూ. 50 కోట్ల బంగారు ఆభరణాలు మాయం.. ఏం జరిగింది..?

తమిళనాడులోని మధురైలో ఉన్న తనిష్క్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. మాస్కులు వేసుకుని వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఇటీవల ఓపెన్ అయిన తనిష్క్ జ్యూవెలరీ షాపులోకి దూరం దాదాపు 20 నుంచి 25 కేజీల బంగారు ఆభరణాలతో జంప్ అయినట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం వీటి విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే అటు పోలీసులు కానీ ఇటు జ్యూవెలరీ షాపు మేనేజ్ మెంట్ కానీ వీటి విలువను ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు.

ఇక మధురై బైపాస్ రోడ్డులో ఉన్న ఈ షోరూమ్ లో బుధవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగినట్లు సమాచారం అందుతోంది. గురువారం ఉదయం జ్యూవెలరీ షాపు ఉద్యోగులు ఓపెన్ చేసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. మధురైలో తనిష్క్ జ్యూవెలరీ అవుట్ లెట్ ను దీపావళి కానుకగా 15 రోజుల క్రితమే ప్రారంభించినట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. దుండగులు షాపు వెనకాల ఉన్న గోడ, కిటికీలను బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. మధురై సిటీ కమిషనర్ ఎస్ రాజేంద్రన్ ఘటనాస్థలికి చేరుకుని తనిఖీ చేశారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్లు ఏజీ ఇనిగో దివ్యాన్ తోపాటు ఎస్. వనిత ఉన్నారు. సిటీ కమిషనర్ ఎస్ రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ముగ్గురు దొంగల ప్రమేయం ఉందని వివరించారు. "ముగ్గురు వ్యక్తులు గోడకు కన్నం వేసి లోపలికి దూరారు. ఆ తర్వాత షాపులోని దాదాపు 30 శాతం వస్తువులను దొంగిలించారు. దుండగులు కచ్చితంగా ఎంత బంగారం దోచుకున్నారో ప్రస్తుతం విచారణ జరిపిస్తున్నాం" అని మధురై సిటీ కమిషనర్ ఎస్ రాజేంద్రన్ స్పష్టం చేశారు.

Tanishq jewellery Massive robbery at shop in Madurai Rs 50 crores worth of gold ornaments stolen

ఘటనాస్థలిలో స్నైపర్ డాగ్స్ ను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఏజీ ఇనిగో దివ్యాన్ పేర్కొన్నారు. దుండగులు షో రూమ్ లో ప్రదర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలను మాత్రమే చోరీ చేసినట్లు వివరించారు. అయితే లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలను మాత్రం టచ్ చేయలేదని స్పష్టం చేశారు. ఇక ఖచ్చితంగా ఎంత మేర బంగారం మాయమైందో షోరూమ్ మేనేజ్ మెంట్ ఇచ్చే ఫిర్యాదు ద్వారానే తెలుస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+