ఆ దేశంలో అడ్డంగా దొరికిన షారుక్ కూతురు

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు తన ప్రియుడుతో దొరికిపోయింది. షారుక్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. సుహానా ఖాన్‌ హీరోయిన్ మెటీరియల్ అని అభిమానులు ఫీల్ అవుతుంటారు. దీనికి తగ్గట్టే అమ్మడు తన అందంతో అభిమానులను కట్టిపడేస్తుంటుంది. ఐపీఎల్‌లో తన జట్టు అయిన కేకేఆర్‌కు మద్దతు తెలుపుతూ సుహానా ఖాన్‌ గ్రౌండ్‌లో చేసే సందడి అంతా ఇంతా కాదు.

Suhana Khan date with Agastya Nanda

సుహానా ఖాన్‌ గ్రౌండ్‌కు వచ్చిందంటే చాలు కెమెరాలన్నీ కూడా ఆమె వైపే ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుహానా ఖాన్‌ తన లేటెస్ట్ ఫొటో‌షూట్‌లతో అభిమానులను అలరిస్తుంటుంది. సుహానా ఖాన్‌ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్య‌తో సుహానా ఖాన్‌ డేటింగ్‌ చేస్తుందని గత కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి.

దీనికి తగ్గట్టే వీరిద్దరు కలిసి చాలాసార్లు దర్శనం ఇచ్చారు. తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్‌లో వీరిద్దరు పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా.. కెమెరాకు అడ్డంగా చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో వీరు రిలేషన్ ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. మరి తమ రిలేషన్‌పై ఈ జంటఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+