Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెగా కుటుంబానికే ఒక దశాబ్దం కేటాయిస్తున్న సుకుమార్.. ఎంతైనా!

మనకున్న దర్శకుల్లో లెక్కల మాస్టారైన సుకుమార్ చాలా సృజనాత్మకంగా సినిమాలు తెరకెక్కిస్తారు. ఒక్కోసారి ఆయన సినిమాలు కూడా లెక్కల పజిల్స్ లా ఉండేవి. దర్శక ధీరుడు రాజమౌళి.. ఒక సందర్భంలో సుకుమార్ లాంటి వ్యక్తి కమర్షియల్ సినిమాలు తీస్తే తమలాంటివారు సరిపోరని అన్నారు. దాన్ని నిరూపిస్తూ 2018లో పూర్తి కమర్షియల్ సినిమాగా రంగస్థలం సినిమాను రామ్ చరణ్ హీరోగా రూపొందించారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పుష్ప ప్రాజెక్టు చేపట్టారు. సుకుమార్ ముందుగా ఏ కథ రాసుకున్నా మహేష్ బాబుకు వినిపిస్తారు. ఆయన వద్దంటే వేరే హీరోతో చేస్తారు. అలాగే పుష్ప కథ రాసుకొని వినిపించగా.. మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించారు. తనకన్నా ఆ కథ అల్లు అర్జున్ కు బాగుంటుందని చెప్పారు.

2018 నుంచి..
దీంతో 2021లో సుకుమార్ పుష్ప ప్రాజెక్టులోకి అడుగుపెట్టారు. ఈ సినిమాను రాజమౌళికి చూపించగా.. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయమని ఆయన సలహా ఇచ్చారు. ఎందుకంటే అందులో అల్లు అర్జున్ గెటప్ మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్ లో నివసించే ప్రజల్లా ఉంటుంది.. దీనికి వారంతా కనెక్ట్ అవుతారనేది రాజమౌళి భావన. అందుకు తగినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో ఒకరకంగా ఈ సినిమా ఫ్లాప్ అయినా ఉత్తర భారతంలో మాత్రం సూపర్ హిట్ అయింది. తర్వాత 2024లో పుష్ప2 విడుదల చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ తో 2018లో రంగస్థలం, 2021లో అల్లు అర్జున్ తో పుష్ప, 2024లో పుష్ప2 విడుదలయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు అన్నివిధాలుగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నారు.

Sukumar is expressing his admiration for Chiranjeevi s family how much

2030 వరకు ఖాళీ లేదు
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చేస్తున్న పెద్ది సినిమా పూర్తవగానే రామ్ చరణ్ ఈ సినిమా సెట్ లో అడుగుపెడతారు. పుష్ప, రంగస్థలం తీసిన మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాను కూడా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలు పడుతుంది. ఇది అవగానే మళ్లీ అల్లు అర్జున్ తో పుష్ప2 సెట్స్ లోకి అడుగుపెడతారు. ఆ సినిమా కూడా ఒక రెండు సంవత్సరాలు పడుతుంది. అంటే ఒకరకంగా సుకుమార్ 2030 వరకు ఖాళీగా ఉండరు. మెగా హీరోలకే విలువైన సమయాన్ని కేటాయించేశారు. మంచి సృజనాత్మకత ఉన్న దర్శకుడైన సుకుమార్ జీవితంలో పది సంవత్సరాలు అంటే సాధారణమైన విషయం కాదు. ఒక దర్శకుడు ఒక సినిమా తీసి విడుదల చేసిన తర్వాత, తర్వాత సినిమా ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. కానీ సుకుమార్ జీవితంలో కీలకమైన 10 ఏళ్లు మెగా కుటుంబానికే కేటాయిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సంవత్సరాలు కేటాయిస్తారేమో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+