ఆ రోడ్డు మీదకు వెళితే మాయమవుతారు.. హారర్ సినిమా అంటే ఇదీ!
చీకటి పడ్డాక ఆ రోడ్డు మీదికి వెళ్లాలంటేనే చుట్టుపక్కల ఊళ్ల జనాలకు వణుకు. ఒక్కసారి ఆ మలుపు తిరిగారో... ఇక తిరిగి రారనే ప్రచారం! ఏదో కల్పిత కథ అనుకోవడానికి లేదు, కేరళలో నిజంగానే ఉన్న ఒక రోడ్డు మలుపు ఆధారంగా తెరకెక్కిన సస్పెన్స్ హారర్ డ్రామా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో ట్రెండ్ అవుతోంది.కథంతా కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉండే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది.
అక్కడ ఒక నిటారైన రోడ్డు మలుపు ఉంది. దశాబ్దాల క్రితం ఆ ప్రదేశంలో ఒక గర్భిణి అత్యంత ఘోరమైన పరిస్థితిలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతుంది. ఆ దుర్ఘటన తర్వాత నుంచే ఆ ప్రాంతంలో వింత సంఘటనలు మొదలవుతాయి. ఆ దారిన వెళ్లే ప్రయాణికులకు ఒక ఆకారం కనిపిస్తుందని, ఆ తర్వాత వాళ్లు ఆచూకీ లేకుండా మాయమవుతున్నారని ప్రచారం ఊపందుకుంటుంది.

నిజయంగానే దెయ్యం తిరుగుతుందా?
నిజంగానే అక్కడ దెయ్యం తిరుగుతోందా? లేక ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని ఎవారైనా నేరాలకు పాల్పడుతున్నారా? అసలు ఆ గర్భిణి చావు వెనుక దాగున్న చేదు నిజమేంటి? అనే ప్రశ్నలకు సమాధానంగా సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. తిరువనంతపురం దగ్గరలోని 'మైలేమూడు' అనే ప్రాంతంలో ప్రచారంలో ఉన్న యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రాన్ని మలిచారు.
విశేషమేమిటంటే... సినిమా శీర్షికగా పెట్టిన 'సుమతి వలవు' (సుమతి మలుపు) అనేది ఊహాజనిత పేరు కాదు, అక్కడి స్థానికులు ఇప్పటికీ ఆ మలుపును అదే పేరుతో పిలుస్తుంటారు. గోకుల్ సురేష్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్, సాయిజు కురుప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కేవలం రూ.5 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, థియేటర్లలో ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
భయపెడుతూనే వెన్నులో వణుకు పుట్టించే ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం 'జీ5' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో మంచి రియలిస్టిక్ హారర్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!














Click it and Unblock the Notifications