ఈ రోజుల్లో రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా, అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్' టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మూన్‌లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా పీపుల్ స్టార్ సందీప్ కిషన్ లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో టీజర్ అదిరిపోయిందని సినీ ప్రియులు అంటున్నారు.
సందీప్ కిషన్ ప్రశంసలు: "నిజాయితీతో కూడిన కొత్త ప్రయత్నం"
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన సందీప్ కిషన్ మాట్లాడుతూ, "ఈ ఈవెంట్‌తో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్‌ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. నేను ఈవెంట్‌కి రావడానికి కారణం నిహాల్. తను టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయాలనే ఆరాటం నాకు చాలా నచ్చింది. తను ఈ వేడుకలో మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా నచ్చాయి. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు. నిహాల్, సూర్య.. వీళ్ళందరిలోనూ ఒక నిజాయితీ ఉంది. తప్పకుండా ఆ నిజాయితీని మనందరం అప్రిషియేట్ చేయాలి. ఒక కొత్త ఫిల్మ్ మేకర్స్, కొత్త నటులు చేసినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచనని చూడడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా" అని అన్నారు.

దర్శకుడు విశ్వనాథరెడ్డి: "దేశభక్తితో కూడిన సవాలుతో కూడిన చిత్రం"
డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, "ఈ వేడుకకు వచ్చిన సందీప్ కిషన్ గారికి ధన్యవాదాలు. మేము చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని క్రియేట్ చేశాం. కమల్ గారు కూడా ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకున్నారు. ఒక దేశభక్తి సినిమా తీస్తూ 'చైనా పీస్' అనే పేరు పెట్టడం చాలా చాలెంజింగ్. మేము అన్ని విభాగాల్లోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
హీరో నిహాల్: "కలలు కష్టపడితే నిజమవుతాయి"
హీరో నిహాల్ మాట్లాడుతూ, "మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన ఒక సినిమా చూసి సందీప్ కిషన్ గారు నా భుజాన చేయి వేసి చాలా చక్కగా చేశావని మెచ్చుకున్నారు. ఆ క్షణం నేను మర్చిపోలేను. కష్టపడి సినిమాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ వస్తుందనే దానికి సందీప్ కిషన్ గారు నిదర్శనం. తప్పకుండా ఆయనే మా సినిమా టీజర్‌ని రిలీజ్ చేయాలని నేను బలంగా కోరుకున్నాను. ఆయన ఈ లాంచ్‌కు రావడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను జగత్‌తో పాటు దాదాపు 20 సినిమాలకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. అవన్నీ కూడా స్కూల్ బంక్ కొట్టడానికి చేశాను. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చింది. ఒక నమ్మకంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలుకని దానికి 100% కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. ఒక్కొక్క సినిమా ఒక కొత్త వాయిస్‌ని తీసుకురావాలి. డైరెక్టర్ విశ్వనాథ్ ఈ సినిమాతో అలాంటి ఒక కొత్త వాయిస్‌ని తీసుకొస్తారు. తనకు కావాల్సింది వచ్చేంతవరకు ఎక్కడా రాజీపడరు. గ్రేట్ రైటింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.
ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల మాటలు:
హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ, "సందీప్ కిషన్ గారికి థాంక్యూ సో మచ్. విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మాట్లాడుతుంది. మీ అందరికీ నచ్చుతుంది. బాగా రీచ్ అవుతుందని నమ్మకం ఉంది. నిహాల్‌కి థాంక్యూ వెరీ మచ్" అని అన్నారు.
యాక్టర్ కమల్ కామరాజు మాట్లాడుతూ, "విశ్వనాథ్ చాలా క్లియర్ విజన్‌తో ఉన్నాడు. తను చాలా పరిణీతితో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు దొరికాడు. స్పై సినిమాలో ఉండాల్సిన అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సినిమా షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నిహాల్, సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.
హర్షిత మాట్లాడుతూ, "ఈ సినిమాలో సారా అనే క్యారెక్టర్‌ని ప్లే చేస్తున్నాను. పర్ఫామెన్స్‌కి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. విశ్వనాథ్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. నిహాల్, సూర్య అందరికీ థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.
దీక్ష పంత్ మాట్లాడుతూ, "చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ విశ్వనాథ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ద్వారా మీ అందరికీ మళ్లీ నచ్చుతానని భావిస్తున్నాను. సందీప్ కిషన్‌కి థాంక్యూ. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాని బ్యూటిఫుల్‌గా తీశారు. తప్పకుండా మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని అన్నారు.












Click it and Unblock the Notifications